ETV Bharat / state

రేపటి నుంచి మునుగోడు ప్రచారానికి కాంగ్రెస్​ నేతలు - Palvai Sravanti Latest News

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. స్రవంతితో పాటు మరో ఆశావాహ నేత చెలమల కృష్ణారెడ్డి కూడా కలిశారు. పార్టీ అధిష్ఠానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఎన్నికల్లో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి నాయకులకు సూచించారు.

రేవంత్‌ రెడ్డి
రేవంత్‌ రెడ్డి
author img

By

Published : Sep 10, 2022, 6:35 PM IST

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. స్రవంతితో పాటు మరో ఆశావాహ నేత చెలమల కృష్ణారెడ్డి కూడా కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని అధిష్ఠానం ప్రకటించిన తర్వాత వీరిద్దరితో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కూడా కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో ఎన్నికల్లో కలిసి పని చేయాలని రేవంత్ రెడ్డి నేతలకు సూచించారు.

తనపై నమ్మకముంచి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించినందుకు అధిష్ఠానానికి, రాష్ట్ర సీనియర్​ నేతలకు స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్‌ అడ్డ అని కార్యకర్తలు నిరూపించాలని ఆమె తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలందరూ కలిసి కట్టుగా పని చేయాలని పాల్వాయి స్రవంతి కోరారు.

రేపటి నుంచి మునుగోడులో కాంగ్రెస్ నేతల ప్రచారం: కాంగ్రెస్‌ నేతలు రేపటి నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్లనున్నారు. త్వరలో మునుకోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. ఇప్పటకే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు , బలరాం నాయక్ , దామోదర్ రెడ్డి , దామోదర రాజనర్సింహ, అంజన్​కుమార్ యాదవ్ ,సంపత్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, చెరకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

"నాకు అవకాశం ఇచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కూడా పిలుపునిస్తున్నాను. ఏది ఏమైనా కచ్చితంగా శక్తి వంచన లేకుండా పనిచేద్దాం. అభివృద్ధి చేసింది కాంగ్రెస్ కావున ఓటు అడిగే హక్కు మనకు ఉంది." - పాల్వాయి స్రవంతి మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి

రేవంత్‌ రెడ్డితో పాల్వాయి స్రవంతి భేటీ

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉపఎన్నిక అనివార్యంగా మారడంతో... ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టిపెట్టాయి.భాజపా అభ్యర్థిగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. అనంతరం మునుగోడులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్‌షా సమక్షంలో భాజపాలో చేరారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డినే భాజపా తమ అభ్యర్థిగా ప్రకటించనుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెరాస అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

ఇవీ చదవండి: దిల్లీ లిక్కర్ స్కామ్.. రేవంత్, రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వార్

గేమింగ్ యాప్​ పేరుతో బడా ఫ్రాడ్​.. ఈడీ సోదాలతో గుట్టు రట్టు.. రూ.7కోట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.