ETV Bharat / state

"నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం లేదు" - తెలంగాణ హైకోర్టులో విచారణ

అధికారాలను ప్రభుత్వం ఏకపక్షంగా చెలాయించటం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి భంగం కలిగించే ముందు వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. మున్సిపల్ చట్టంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

no-power-to-tear-down-without-notice-hi-court
"నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం లేదు"
author img

By

Published : Mar 3, 2020, 5:04 AM IST

Updated : Mar 3, 2020, 7:44 AM IST

ఆస్తి హక్కు.. రాజ్యాంగం కల్పించిన హక్కు

ప్రభుత్వం తన అధికారాలను ఏకపక్షంగా చెలాయిస్తామంటే కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజల హక్కులు, ప్రభుత్వ అధికారాల మధ్య సమన్వయం ఉండాలని పేర్కొంది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాకపోయినప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి భంగం కలిగించే ముందు వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది.

"నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారం లేదు"

మున్సిపల్ చట్టంపై.. కౌంటరు దాఖలు చెయ్యండి

అక్రమ నిర్మాణాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడుతూ... తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంపై.. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11కి హైకోర్టు వాయిదా వేసింది.

ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ

ప్రభుత్వం తీసుకువచ్చిన మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178(2)ను సవాలు చేస్తూ.. దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178(2) ఒక్కదాన్ని విడిగా చూడరాదని... దీన్ని సెక్షన్ 174(4)తో కలిపి చూడాలంది.

ఈ సెక్షన్ ప్రకారం చట్ట విరుద్ధంగా నిర్మాణం చేపట్టమని హామీ ఇస్తారని.. అయితే ఆ తరువాత మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మిస్తే ఏకపక్షంగా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించింది. ఉరి తీసేవాడికీ అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వరా అంటూ ప్రశ్నించింది .

న్యాయస్థానంలో విచారణ జరిగిన తీరు..

ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది :

ఈ చట్టం వల్ల ఎవరూ నష్టపోలేదని, ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద దీన్ని విచారించడం సరికాదన్నారు. హామీకి విరుద్దంగా ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మించినప్పుడు మాత్రమే.. కూల్చివేయడానికి అధికారం ఉంటుందన్నారు.

ధర్మాసనం :

సాంకేతిక కారణాలను చూపడం సరికాదు, ప్రజాప్రయోజన వ్యాజ్యం రూపంలో ఎవరైనా రావచ్చు.

అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ :

అక్రమ నిర్మాణాలపై ఇటీవల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

ధర్మాసనం :

దీనిపై అవగాహన ఉంది.. కానీ.. అధికారాన్ని ఏకపక్షంగా కమిషనర్‌కు కట్టబెడతామంటే ఎలా..?

"అధికారాల మీద నియంత్రణ ఉండాలి. ఇలాంటి నియంత్రణ అధికారం చట్టంలో ఎక్కడుందో చూపాలి. ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామంటున్నారని.. మేము చెప్పేదాకా లోకాయుక్తను ఏర్పాటు చేయాలని, ఖాళీలు సాధారణమయ్యాయి... 2022 వరకు మీరు ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయకపోతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి.? ఉదయం నిద్ర లేచేసరికి బుల్డోజర్ ఇంటి ముందు ఉంటే అతను ఎక్కడికెళ్లాలి..?"

న్యాయవాది:

హామీ ఇచ్చి ఉల్లంఘించినప్పుడు.. నోటీసు ఎందుకివ్వాలి..?

ధర్మాసనం:

నేను పెద్ద నేరస్తుడినే కావచ్చు. ఎలాంటి విచారణ లేకుండా, సహజ న్యాయసూత్రాలు పాటించకుండా.. ఉరి తీస్తారా అంటూ ప్రశ్నించింది. రాజ్యాంగ హక్కుపై దాడి చేసేముందు.. వివరణ వినే అవకాశం ఉండదా అని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు కూడా సహేతుకతను చూడాలని సూచించిందని... ఎలాంటి హక్కు లేకుండా పేవ్‌మెంట్‌పై ఉన్న గుడిసెలను తొలగించడానికి నోటీసులు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పిందని ప్రస్తావించింది. మొదటి ప్లాన్ తీసుకుని.. అదనపు అంతస్తులు నిర్మించారని కూల్చివేస్తారని.. ఒకవేళ కమిషనర్‌కు తెలియకుండా టౌన్‌ప్లానింగ్ అనుమతించి ఉంటే.. పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.

" ఏకపక్ష అధికారాలకు నియంత్రణ ఉండేలా... శాసనవ్యవస్థ చట్టాన్ని తీసుకువచ్చి ఉండాల్సిందని, దీనికి ఉన్న నియంత్రణ, పరిమితులు, ప్రత్యామ్నాయాలపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది"

ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

Last Updated : Mar 3, 2020, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.