ETV Bharat / state

పారిశుద్ధ్యమే పరమావధిగా

పట్టణాల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఆదేశించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై శనివారం రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

Municipal Secretary Arvindkumar
పారిశుద్ధ్యమే పరమావధిగా
author img

By

Published : Mar 29, 2020, 8:52 AM IST

రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్​ అన్నారు. ఆసుపత్రులు, మార్కెట్లు, కరోనా వైరస్‌ ఐసోలేషన్‌ వార్డులు, క్వారంటైన్‌హోంలు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. శనివారం రాష్ట్రంలోని పురపాలక కమిషనర్లతో ముఖ్య కార్యదర్శి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్చిన వారు, నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించాలని స్పష్టంచేశారు. భిక్షాటన చేసేవారు, నిరాశ్రయులను తక్షణం నైట్‌షెల్టర్లకు తరలించి రోజూ ఆహారం, అవసరమైన సాయం అందించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నిర్మాణ సంస్థలే వసతి కల్పించాలని, పురపాలక సంఘాలు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సూపర్‌ మార్కెట్లు, ఫుడ్‌ డెలివరీ సేవలు అందించేవారితో, స్వచ్ఛంద సేవా సంస్థలతో పురపాలక కమిషనర్లు సమన్వయం చేసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్​ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.