'సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ' ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంటర్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోం శాఖ మంత్రి మహముద్ అలీతో కలిసి ప్రారంభించారు. శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం, సమగ్ర అభివృద్ధికి అన్ని అంశాల్లో రాష్ట్రాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడం కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డేటా సెంటర్ నిర్మాణం ఉద్దేశం.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 14 మీ. పొడవు, 4.2 మీ. ఎత్తుతో భారీ తెర ఏర్పాటు చేశారు. తెరకు ఇరువైపులా 55 అంగుళాలు ఉన్న మరో 4 టీవీలు ఉంచారు. ఏకకాలంలో ఈ భారీ తెరపై 5వేల సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అక్కడ 4 కి.మీ ప్రయాణం చేయాలంటే గంట సమయం