ETV Bharat / state

KTR: 'అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగంగా వ్యవహరించాలి' - Minister ktr latest updates

హైదరాబాద్ పాతబస్తీలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ktr
కేటీఆర్
author img

By

Published : Aug 9, 2021, 7:44 PM IST

హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Oldcity)లో పలు పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలును మరింత వేగవంతం చేయాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ (Minister Ktr) సూచించారు. పాతబస్తీలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్... సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో పురపాలక శాఖ అధికారులు వివిధ ఆయా పథకాలు కార్యక్రమాల కింద చేపట్టిన పనుల వివరాలను మంత్రికి అందజేశారు. పాతబస్తీలోని వివిధ నియోజకవర్గాల్లో ఎస్సార్డీపీ కింద నిర్మిస్తున్న పలు ఫ్లై ఓవర్లు, రహదారులు, నాలాల వెడల్పు కార్యక్రమం, రెండు పడక గదుల నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్, పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రగతిపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా పనుల అమలులో ఎక్కడైనా అనుకోని అవాంతరాలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తేవాలని, పనులన్నీ సమయానికి పూర్తి అయ్యేలా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించాలి అని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ దళిత, గిరిజన దండోరా సభ.. భారీగా తరలివచ్చిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.