పురపాలక రిజర్వేషన్లను జనవరి 5న ఖరారు చేయనున్నట్లు పురపాలక శాఖ సంచాలకులు టీకే శ్రీదేవి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల కోసం 130 చోట్ల ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించామని... వాటిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి.. ఈఆర్ఓలకు పంపుతామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తామని, ఆ తర్వాత 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తామని శ్రీదేవి పేర్కొన్నారు. బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు అన్నది సరికాదని స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లోనూ మహిళలకు సగం స్థానాలను లాటరీ ద్వారా రిజర్వ్ చేస్తామని వెల్లడించారు.
మేయర్, ఛైర్పర్సన్లకు రాష్ట్ర స్థాయిలో... వార్డు సభ్యులకు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. 141 మున్సిపాలిటీలకు ఒకేసారి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని... కొత్త చట్టం ప్రకారం మొదటి రిజర్వేషన్లు, తదుపరి ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు వర్తిస్తాయని వివరించారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్న వారు కూడా పురపాలక ఎన్నికల్లో పోటీ చేయోచ్చని శ్రీదేవి తెలిపారు.
ఇవీ చూడండి: డిసెంబర్ 31న మందుబాబులకు మెట్రో స్పెషల్ ఆఫర్