ETV Bharat / state

పురపాలనపై చట్టం ఏం చెబుతోందంటే...? - Municipal Act on Telangana Municipal Elections

పురపాలనలో మేయర్లు, ఛైర్​పర్సన్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. పట్టణాలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాల్సి ఉంటుంది. బాధ్యతల్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా పదవులు కోల్పోయే ప్రమాదముంది. ఆ మేరకు పురపాలక  చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు.

Municipal Act on Telangana Municipal Elections
పురపాలనపై చట్టం ఏం చెబుతోందంటే...?
author img

By

Published : Jan 7, 2020, 5:29 AM IST

Updated : Jan 7, 2020, 6:40 AM IST

నగరపాలక సంస్థల పాలకమండళ్లకు మేయర్లు, పురపాలక సంస్థల పాలకమండళ్లకు ఛైర్‌పర్సన్లు నేతృత్వం వహిస్తారు. పాలకమండళ్ల సమావేశాలకు అధ్యక్ష్యత వహించనున్న మేయర్లు, ఛైర్‌ పర్సన్లు పురపాలనను సాఫీగా సాగించాల్సి ఉంటుంది. మేయర్లు, ఛైర్‌పర్సన్ల కర్తవ్యాలు, బాధ్యతలను పురపాలక చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

చట్టంలో 23వ విభాగం ప్రకారం.. ప్రతి నెల ఒకసారి పాలకమండలిని సమావేశపరచాలి. కౌన్సిల్ సభ్యులంతా.. లేదా సగం మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరినప్పుడు పాలకమండలి భేటీ కావాలి. పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరాతో పాటు వీధి దీపాలు సరిగా నిర్వహించాలి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన మేరకు పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించాలి.

ఏటా పురపాలిక లెక్కల ముగింపు ఆడిటింగ్ చేపట్టాలి. పురపాలికకు సంబంధించిన ఆస్తులను ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 24 గంటల్లోగా ఛైర్‌పర్సన్లు సంతకం చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ మంజూరు లేని పనిని జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొనే చేయాల్సి ఉంటుంది.

పురపాలనపై చట్టం ఏం చెబుతోందంటే...?

ఇదీ చదవండిః బాలల సైన్స్​ కాంగ్రెస్​ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని

TG_Hyd_68_06_Election_Spl_Chairpersons_Pkg_3053262_3181965 From : Raghu Vardhan, Praveen ( ) పురపాలనలో మేయర్లు, ఛైర్ పర్సన్లు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. పట్టణాలకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాల్సి ఉంటుంది. బాధ్యతల్లో అలక్ష్యంగా వ్యవహరించినా.. నిర్లక్ష్యంగా ఉన్నా.. ఏకంగా పదవులు కోల్పోయే ప్రమాదముంది. ఆమేరకు పురపాలక చట్టంలో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు... లుక్ వాయిస్ ఓవర్ - నగరపాలక సంస్థల పాలకమండళ్లకు మేయర్లు, పురపాలక సంస్థల పాలకమండళ్లకు ఛైర్ పర్సన్లు నేతృత్వం వహిస్తారు. పాలకమండళ్ల సమావేశాలకు అధ్యక్ష్యత వహించనున్న మేయర్లు, ఛైర్ పర్సన్లు పురపాలనను సాఫీగా సాగించాల్సి ఉంటుంది. మేయర్లు, ఛైర్ పర్సన్ల కర్యవ్యాలు, బాధ్యతలను పురపాలక చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. చట్టంలోని 23వ విభాగంలో వారి బాధ్యతలు పేర్కొన్నారు. ప్రతినెల ఒకసారి విధిగా పాలకమండలిని సమావేశపరచాల్సి ఉంటుంది. కౌన్సిల్ సభ్యులందరూ లేదా సగం మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరినప్పుడు కూడా పాలకమండలిని సమావేశపరచాల్సి ఉంటుంది. పట్టణంలో పారిశుధ్యం, నీటిసరఫరా మెరుగ్గా ఉండేలా చూడటంతో పాటు..వీధి దీపాలు సరిగా నిర్వహించాలి. నివాస, వాణిజ్యసముదాయాల నుంచి చెత్తను, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో సేకరించి వాటిని సమగ్ర నిర్వహణ చేపట్టాలి. పురపాలికలో గ్రీన్ సెల్ ను ఏర్పాటు చేసి బడ్జెట్ లో పదిశాతం నిధులను కేటాయించాలి. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన మేరకు పట్టణంలో నర్సరీ ఏర్పాటుచేసి మొక్కలు పెంచాలి. పట్టణంలో పచ్చదనం మెరుగ్గా ఉండేలా చెట్లను నాటి సంరక్షించాలి. సదరు మేయర్, ఛైర్ పర్సన్ ప్రాతినిథ్యం వహిస్తున్నవార్డులో కనీసం 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి. పట్టణ పరిధిలోని పార్కుల అబివృద్ధి నిర్వహణతో పాటు.. జలాశయాల పరిరక్షణ కొరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించాలి. ప్రతీ ఏడాది పురపాలిక లెక్కల ముగింపు ఆడిటింగ్ చేపట్టాలి. పురపాలికకు సంబంధించిన ఆస్తులను కాపాడటంతో పాటు.. ఎవరైనా ఆక్రమించుకుంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. పట్టణ పరిధిలో నీటి వృథా, నీటి నష్టాలను అరికట్టాలి. వర్షపు నీటి సంరక్షణ కోసం అవసరమైన మేర ఇంకుడు గుంతలు, ఇతర నిర్మాణాలను ప్రోత్సహిచాల్సి ఉంటుంది. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 24 గంటల్లోగా ఛైర్ పర్సన్లు సంతకం చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ మంజూరు లేని ఏదైనా పనిని జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొనే చేయాల్సి ఉంటుంది.
Last Updated : Jan 7, 2020, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.