కంటైన్మెంట్ జోన్ తొలగించినప్పటికీ కొవిడ్-19 పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మరికొన్నాళ్ల పాటు క్రిమిసంహారక రసాయనాలను చల్లాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నియంత్రణ చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జోనల్ కమిషనర్లతో సమావేశమైన అరవింద్ కుమార్... కరోనా నియంత్రణ చర్యలపై చర్చించారు.
భౌతికదూరం నిబంధనలను నగరంలో పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. భౌతికదూరం పాటించని, పండ్ల మార్కెట్లు, రైతుబజార్లను మూసివేయాలని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజలకు కూరగాయలకు ఇబ్బంది రాకుండా మొబైల్ రైతుబజార్ వాహనాలను కాలనీల్లోకి ముందుగానే చేరుకునేలా పర్యవేక్షించాలని అర్వింద్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి: జూన్ రెండో వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలు: మంత్రి సబిత