ETV Bharat / state

'ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

ఐక్యరాజ్య సమితి ఆదివాసీ దినోత్సవాన్ని ఆగస్టు 9న అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి వినతిపత్రం అందించారు.

author img

By

Published : Aug 6, 2019, 5:27 PM IST

ఎమ్మెల్యే సీతక్క

రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవాన్ని ఈ నెల తొమ్మిదిన అధికారికంగా నిర్వహించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసిన ఆమె ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వారి జనాభా ఉన్న ప్రతి జిల్లాకు పది కోట్ల రూపాయలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలో వైద్య సదుపాయాలు లేక డెంగ్యూ, మలేరియాతో గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఐదేళ్లు పూర్తైనా... ఆదివాసీల గురించి సర్కారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా వారి సమస్యలు పరిష్కరించే దిశగా దృష్టి పెట్టాలని కోరారు.

'ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి'

ఇదీ చూడండి : పుర ఎన్నికలపై హైకోర్టు విచారణ ఈనెల 13కు వాయిదా

Intro:కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా:

తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం. హరితహారం 2015 జులైలో చిలుకూరు బాలాజీ దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి చే అధికారికంగా ప్రారంభించబడింది.
జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సంతులనం కొనసాగించడానికి మొత్తం భూమి విస్తీర్ణం లో కనీసం 33 శాతం భూమి అడవులు చెట్లు ఉండాలని ఇది సమస్త జీవులు మానవులు జంతువులు మరియు మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరమని యెచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విస్తీర్ణం లో అడవుల పాత్ర కేవలం 25.16 శాతం ఉంది.రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన 33% స్థాయికి అడవులను పచ్చదనం పెంచడానికి వారి అటవీకరణ కార్యక్రమాలలో భాగంగా ఒక ప్రధాన కార్యక్రమం తెలంగాణ హరితహారం ముందుకు తీసుకువచ్చింది.
ఇందులో భాగంగా సింగరేణి సంస్థ తమ వంతు కర్తవ్యంగా ఎస్ శ్రీధర్ ఐఏఎస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మార్గదర్శకాలతో ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ప్రతిన పునగా గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి సింగరేణి ఏరియాలలో ఒక పండుగ వాతావరణం జరుపుకుంటూ వస్తుంది. అదేవిధంగా మన బెల్లం పెల్లి ఏరియాలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారుగా 28.3 లక్షల మొక్కలను 1283 హెక్టార్లలో నాటడం జరిగిందని ఏరియా జిఎం కొండయ్య వివరించారు. ఈ సంవత్సరం అనగా 2019లో గానూ 490 ఎకరాలలో 8,16,000 మొక్కలను నాటుటకు మరియు పంపిణీ చేయుటకు ప్రతిపాదన చేయడం జరిగిందని ఈ మొక్కల సేకరణకు సింగరేణి వ్యాప్తంగా భారీ ఎత్తులో తమ తమ సొంత నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో5వ విడత తెలంగాణకు హరితహారం లో భాగంగా గోలేటి x రోడ్డు వద్ద గల CHPలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా జడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మీ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, ఏరియా జిఎం కొండయ్య, మరియు బెల్లంపల్లి ఏరియా తెలంగాణ బొగ్గుగని వైస్ ప్రెసిడెంట్ మల్లాజ్ శ్రీనివాస్ రావు, ఎంపీపీ దుర్గం శ్రీదేవి,జడ్పీటీసీ వేముల సంతోష్, మరియు వివిధ కార్మిక ప్రజాప్రతినిధులు కార్మికులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జి.వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురంభీం అసిఫాబాద్ జిల్లా

Body:Tg_adb_25_haritha_haram_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.