ETV Bharat / state

GHMC: ఆకుపచ్చగా మారబోతున్న గ్రేటర్‌ హైదరాబాద్ రోడ్లు! - తెలంగాణ వార్తలు

గ్రేటర్‌ హైదరాబాద్ రోడ్లు ఆకుపచ్చగా మారబోతున్నాయి. రహదారుల వెంట పచ్చదనం ఉట్టిపడేలా భారీగా మొక్కలు నాటాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. రోడ్లకు ఇరువైపుల నాలుగు నుంచి ఆరు వరుసల్లో మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తోంది. మొదటి విడతగా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని ఆరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు... దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో.... ఇరువైపులా మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టారు.

GHMC, haritha haram
హరితహారం, జీహెచ్​ఎంసీ
author img

By

Published : Jul 4, 2021, 5:08 PM IST

భాగ్యనగరంలోని రోడ్లకు ఇరువైపుల భారీగా మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మల్టీ లెవల్ అవెన్యూ ప్లాంటేషన్​గా వ్యవహరించే నూతన విధానంతో వీటిని నాటనుంది. తీగజాతి, కాగితం పూలు, పూల పొదల మొక్కలు మొదటి వరసలో నాటనున్నారు. ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, మెగాఫోటమికా జాతి మొక్కలు... చివరి వరసల్లో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి చెట్లను నాటుతారు. ముందుగా పూల మొక్కలు, రెండు మూడు ఫీట్లు దట్టంగా పెరిగే మొక్కలు, చివరగా ఏపుగా పెరిగే చెట్లు వాహనదారులకు కనువిందు చేయనున్నాయి.

సీఎస్ సంతృప్తి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచనలతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ విధమైన ప్లాంటేషన్‌ను జీహెచ్ఎంసీ పెద్దఎత్తున చేపట్టింది. మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్‌ విధానంపై సీఎస్ సోమేశ్‌కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆరాంఘర్ వరకు పూర్తిస్థాయిలో మల్టీలెవల్ ప్లాంటేషన్‌ను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ప్రధాన రహదారి మధ్యలో ఉన్న రోడ్ డివైడర్లలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. హరితహారంలో భాగంగా సీఎస్ మొక్కలు నాటారు.

పచ్చని రంగేసినట్లు..

గ్రేటర్​లో అనువుగా ఉన్న రహదారుల్లో మల్టీలెవల్ ప్లాంటేషన్‌ను చేపడుతున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మియాపూర్ బస్‌డిపో, బీకే ఎన్‌క్లేవ్‌ రోడ్, రాందేవ్ గూడ నుంచి నెక్నాంపూర్‌ రోడ్... మల్కాజిగిరి సర్కిల్‌లోని జడ్​టీసీ నుంచి ఎస్​ఎఫ్​సీ వరకు ఈ ప్లాంటేషన్‌ను చేపట్టామని వివరించారు. రణగొణధ్వనులు, వాతావరణ కాలుష్యంతో ఉండే హైదరాబాద్​ను పచ్చని రంగేసిన భాగ్యనగరంగా మార్చడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఆకుపచ్చ తెలంగాణే ధ్యేయం

ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం మళ్లీ ప్రారంభమైంది. ఏడో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. రహదారుల వెంట బహుళ దశల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.