bibi ka alam in old city: హైదరాబాద్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపును భక్తి, శ్రద్ధలతో చేపట్టారు. ఇవాళ డబీర్ పురలో ప్రారంభమైన బీబీకా ఆలం ఊరేగింపు పలు ప్రాంతాలమీదుగా చాదర్ఘాట్ వరకు కొనసాగనుంది. డబీర్ పుర నుంచి ప్రారంభమైన ఊరేగింపు షేక్ ఫైజ్ కమాన్, అలిజ కోట్లా, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేశా, మీర్ చౌక్, పురాని హావేలి, దరూల్ షిప్, కాలి ఖబర్ మీదుగా చాదర్ఘాట్ చేరుకుంటుంది.
త్యాగానికి ప్రతీకగా నిలిచే మొహర్రం సందర్భంగా సంతాప దినాల్లో భాగంగా షియా ముస్లింలు కత్తులతో, బ్లేడ్లతో తమ శరీరాలపై కొట్టుకుంటు తమ రక్తాన్ని చిందిస్తారు. మొహర్రం వేడుకల్లో మాతం చేస్తూ తమ సంతాపాన్ని తెలియజేస్తారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపుకు సంబంధించి హైదరాబాద్ దక్షిణ మండలం పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేసారు. చార్మినార్ వద్ద బీబీకా ఆలంను చూడడానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
ఇవీ చదవండి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల పాదయాత్ర
గాంధీని నిలదీసి.. నారీమణుల ఉప్పు సత్యాగ్రహం- ఒళ్లు కాలినా వెనకడుగు వేయక..