ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి రోజు పలు రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కొందరు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. నిజామాబాద్లో ఇవాళ నలుగురే ఉపసంహరించుకున్నారు. వీరిలో ముగ్గురు రైతులు, ఓ స్వతంత్ర్య అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 185 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో 178 మంది ఎర్రజొన్న, పసుపు రైతులే. ఈ స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మిగతా అన్ని చోట్ల ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వచ్చే నెల 11న తెలుగు రాష్ట్రాలతో సహా 91 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఇవీ చూడండి;బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు