తెలంగాణలో బలమైన పార్టీ రావల్సిన అవసరముందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ అన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఆవేదనతో ఉన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను ఆయన కలిశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పాలన, రాజకీయాలపై చర్చించినట్లు ఆయన చెప్పారు. షర్మిల పార్టీ పెట్టి ముందుకు వస్తే అందరం సహాకారం అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మంచి పాలన రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు.
ఇదీ చూడండి: నేడు, రేపు బార్ల లైసెన్స్లు... 22 జిల్లాల్లో లాటరీలు