సుప్రీం కోర్టు తీర్పు వెనక కేంద్ర ప్రభుత్వం లేకపోతే రిజర్వేషన్ ప్రాథమిక హక్కుకాదని తీర్పువచ్చి 15 రోజులైనా రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ఎమ్‌ఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు కేంద్రం ఎందుకు ముందుకు రాలేదని మండిపడ్డారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మాదిరిగా న్యాయ వ్యవస్థలోనూ రిజర్వేషన్లు కల్పించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పును నిరసిస్తూ మార్చి ఒకటో తేదీన 50 కుల, 50 ఉద్యోగ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు.
ఇవీ చూడండి:విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!