తహసీల్దార్ సుజాతకు నిన్న రాత్రి జైలు నుంచి బెయిల్‌పై ఇంటికి వచ్చారు. భర్త అజయ్‌కుమార్ మృతి కారణంగా కోర్టు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ మధ్యాహ్నం సుజాత భర్త అజయ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న రాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులు అజయ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలోనే ఉంచారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అంబర్‌పేట శ్మశానవాటికలో అజయ్‌కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉస్మానియా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అజయ్‌కుమార్ పనిచేశారు. సుజాత జైలుకు వెళ్లాక చిక్కడపల్లిలోని తన సోదరి ఇంట్లో అజయ్‌కుమార్ ఉన్నారు. భూవివాదం కేసులో వారంక్రితం తహసీల్దార్ సుజాతను పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చూడండి: సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర ప్రారంభం