కేసీఆర్ నియంతృత్వ పోకడలకు గుణపాఠంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉన్నాయని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు. ఈ ఫలితాలు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వానికి గట్టి దెబ్బ వంటిదన్నారు. పార్లమెంట్ సీట్లన్నీ తామే గెలుస్తామని చెప్పుకున్న గులాబీ నాయకులకు సగం సీట్లకే పరిమితమయ్యారన్నారు. నియంతృత్వ, కుటుంబ పాలన పోకడలకు బ్రేక్ పడిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా ఈ ఫలితాలు మేలు చేశాయనే భావిస్తున్నట్లు వివేక్ వివరించారు.
ఇవీ చూడండి: 'ఓడిన వారిని దెప్పిపొడవడం సరికాదు'