హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్‌ను ఎంపీ సంతోష్‌కుమార్ సందర్శించారు. ఆస్పత్రిలో పడకల సంఖ్యను పెంచేందుకు, డయాలసిస్ బాధితులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తన ఎంపీ నిధులు కేటాయిస్తానని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని సంతోష్ వైద్యులకు సూచించారు. వాటితో పాటు సీఎస్ఆర్ కింద కూడా నిధులను సమీకరించుకునే వీలుందని, ఇందుకు సంబంధించి కూడా తాను దాతలకు విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.
గతంలో డయాలసిస్ చేయించుకోవాలంటే వేల ఖర్చు అయ్యేదని.... ఇప్పుడు నయాపైసా లేకుండా ఉచితంగా చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను విస్తరిస్తామని ఎంపీ సంతోష్‌కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి: ఓ మంచి ఆలోచన... కొందరికి ఉపాధి.. ఎందరికో ఆదర్శం.. అదెలా అంటే..!