ఈనెల 27న తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌కుమార్ సూచించారు. కరోనాకు చరమగీతం పాడే వరకు తెరాస కార్యకర్తలందరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఆవిర్భావ దినం సందర్భంగా వీలైనన్ని మాస్కులు పంపిణీ చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. గుమిగూడవద్దని ఆయన స్పష్టం చేశారు.
కరోనాపై పోరాటంలో తెరాస కార్యకర్తలు కూడా తమదైన పద్ధతుల్లో పాలుపంచుకోవాలన్నారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాప్తి ఒకటిన్నర శాతమే ఉంటుందని ఓ అధ్యయనంలో తేలిందని వివరించారు. కాబట్టి ఇవాళ్టి నుంచి మాస్కులు లేకుండా ఎవరూ కనిపించవద్దని.. యుద్ధప్రాతిపదికగా వెంటనే అమలు చేద్దామని సంతోశ్ కుమార్ అన్నారు.
-
20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
— Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv
">20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
— Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020
27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి తెరాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
— Santosh Kumar J (@MPsantoshtrs) April 22, 2020
27 ఏప్రిల్ రోజున పార్టీ మాస్కులు ధరిద్దాం, నిబంధనలు పాటిద్దాం ....#TRSParty#WearFaceMask #StaySafe #FightAgainstCoronaVirus pic.twitter.com/24d1tke0iv
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం