ETV Bharat / state

విభజన హామీల అమలుకు కలిసి పోరాడదాం: రేవంత్‌రెడ్డి - congress news

విభజన సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను భాజపా విస్మరించిందని... వాటికోసం కలిసి పోరాడదామని ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్​ పట్టభద్రుల ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపిస్తారని ఆయన కోరారు.

mp-revanth-reddy-mlc-election-campaign-at-medchal
విభజన హామీల అమలుకు కలిసి పోరాడదాం: రేవంత్‌రెడ్డి
author img

By

Published : Mar 5, 2021, 4:57 PM IST

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్​ జిల్లాలోని కుత్బుల్లాపూర్​లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి హాజరయ్యారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ వాటిని నెరవేర్చడంలో సఫలం కాలేదని రేవంత్ ఆరోపించారు. తెలంగాణలో నీళ్లు ఏపీ సీఎం జగన్​కు, నియామకాలు ఆయన కుటుంబానికి, నిధులన్ని ఆయన బంధువులకు ఇచ్చారని వ్యాఖ్యానించారు.

పునర్‌విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను రాబట్టేందుకు తెరాస కలిసి రావాలని కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్‌ వద్ద దీక్షకు దిగుదామని మంత్రి కేటీఆర్​కు సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు హామీలు ఇస్తే.. భాజపా విస్మరించినా పోరాడేందుకు తెరాస భయపడుతోందని రేవంత్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ పట్టభద్రుల ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల వాణిని మండలిలో వినిపిస్తారని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'బాబ్లీ కోసం పోరాడినట్లే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.