ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికపై కేంద్ర ఎలక్షన్ కమిషన్​ను కలుస్తాం: రేవంత్ - మాజీ మంత్రి షబ్బీర్​ అలీ

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ఎంపీ రేవంత్​ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్​ అలీలు స్పష్టం చేశారు. కేసీఆర్​ రాజకీయాల వల్ల తెలంగాణకు జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుందని ఆరోపించారు.

MP Revanth Reddy, EX minister Shabbir Ali Comments On Kcr
నిజామాబాద్​ ఎమ్మెల్సీ వ్యవహారంపై.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తాం
author img

By

Published : Oct 6, 2020, 11:11 AM IST

నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్​ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మాజీ మంత్రి షబ్బీర్​ అలీతో కలిసి గాంధీ భవన్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్​ రాజకీయాల వల్ల దేశంలో ఎక్కడికి వెళ్లినా తల ఎత్తుకోలేక పోతున్నామని.. తెలంగాణ అంటేనే స్వార్థ రాజకీయాలు అనే స్థాయికి కేసీఆర్​ రాష్ట్రం పేరును దిగజార్చారని రేవంత్​ రెడ్డి అన్నారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తాము పూర్తి ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా బృందాలను పంపించి రిసార్టులలో తనిఖీలు చేయిస్తే.. తెరాస క్యాంపులు బయట పడతాయని, ఎవరైతే రిసార్టులకు పంపించారో.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు రాములు నాయక్‌ను, భూపతి రెడ్డిలపై అనర్హత వేటు వేశారని... అదే కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెరాసలోకి వెళ్లిన వారిపై ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ ఆకర్ష్​పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిసార్ట్‌లో వందమంది లెక్కన జెడ్పీటీలను బందీ చేశారని విమర్శించారు.

ఇదీ చదవండి: దేశంలో ఎక్కడైనా రైతు పంటను అమ్ముకోవచ్చు: భాజపా ఎంపీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.