తెరాస ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసిందని గతంలో కిషన్‌రెడ్డి ఆరోపించారని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Mp Revanth Reddy) అన్నారు. ఈ అంశంపై కేంద్రం ఎందుకు విచారణ జరపలేదని రేవంత్ ప్రశ్నించారు. యూనియన్ కేబినెట్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణ చేసినపుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కిషన్‌రెడ్డి ఆరోపణలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని... ఆయన పేర్కొన్నారు.
హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి... ఆరేడు నెలల కింద ఓ ప్రకటన చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం మా టెలిఫోన్లను ట్యాప్ చేస్తుంది అని. కేంద్రమంత్రే విచారణ చేయగల శాఖలో ఉండి... హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి.. నిస్సహాయంగా తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లను హ్యాక్ చేసిందనో... ట్యాప్ చేసిందనో చెప్పిండంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలే. స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రే... కేసీఆర్ బాధితుడని బహిరంగంగానే చెప్పిండు కిషన్‌రెడ్డి. మీరు ఆరోజు కేసీఆర్ మీద చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నరా? ఒకవేళ కట్టుబడి ఉంటే కేసీఆర్ మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం విచారణకు ఆదేశించడానికి మీరు ఆలోచన చేస్తున్నరు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారో ఈ దేశ ప్రజలకు చెప్పాలి. ఈ అంశాల్ని కిషన్‌రెడ్డి... తెలంగాణ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ ఉందో.. ఈ అంశాలను చర్చకు వచ్చినపుడు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా. ఒక యూనియన్ కేబినెట్ మినిస్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణ చేసినపుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదో పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా.
-- రేవంత్ రెడ్డి, ఎంపీ
ఇదీ చూడండి: Bhatti: 'ఫోన్ల హ్యాకింగ్‌తో ప్రజాస్వామ్యానికి రక్షణ కరవు'