ETV Bharat / state

'పీఎం, సీఎం ఎన్నికలపై మాత్రమే దృష్టి పెట్టారు'

దేశంలో మొదటి సారి లాక్​డౌన్​ అనంతరం కాంగ్రెస్​ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకమే ప్రజలను ఆదుకుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్​లు సహాయనిధిపేరుతో కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. ఆ నిధులు కరోనా కోసం ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్​ సోకిన వారికి ఆక్సిజన్​ను ఉచితంగా అందించాలని డిమాండ్​ చేశారు.

mp revanth reddy, revanth reddy comment on PM modi CM kcr
'పీఎం, సీఎం ఎన్నికలపై మాత్రమే దృష్టి పెట్టారు'
author img

By

Published : Apr 23, 2021, 6:46 PM IST

కరోనా మొదటి వేవ్‌ గురించి 2020 ఫిబ్రవరిలోనే రాహుల్‌ గాంధీ హెచ్చరిస్తే... భాజపా నేతలు పప్పూ అంటూ అవహేళన చేశారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఆ తరువాత చెప్పాపెట్టకుండా లాక్‌డౌన్‌ విధించారని, ఆ సమయంలో కాంగ్రెస్‌ తీసుకొచ్చిన ఉపాధిహామీ పథకమే ఆదుకుందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి సహాయనిధి పేరుతో రూ.20 వేల కోట్లు వసూలు చేశారని, తెలంగాణలో సీఎం సహాయనిధి పేరున అయిదువేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. కరోనా మందుల కోసం ఆ నిధులు వెచ్చించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.

రాజకీయాలపై దృష్టి

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు ఎన్నికలు... రాజకీయాల మీదనే దృష్టి పెట్టారని రేవంత్​ విమర్శించారు. ప్రపంచంలోని 50 దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేశామని నేతలు చెప్పుకుంటున్నారని... ఇవాళ దేశంలోనే అందుబాటులో లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. టీకాకు మూడు రకాల ధరలు నిర్ణయించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించిన ఆయన... ఇది సామాన్యుడిని దోచుకోవడమేనని దుయ్యబట్టారు.

ఉచితంగా అందించాలి

దేశంలో కరోనా మరణ మృదంగం చేస్తోందని.. ఆక్సిజన్, మందులు లేవని విమర్శించారు. రాష్ట్రంలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన టిమ్స్ హాస్పిటల్‌లో సిబ్బంది లేరని, సదుపాయాలు అంతకంటే లేవన్నారు. టిమ్స్‌లో ఇప్పటికే 38 మంది చనిపోయారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆక్సిజన్ తయారు చేస్తున్న కంపెనీలను జాతీయ విపత్తు కింద స్వాధీనం చేసుకుని ప్రజలకు ఉచితంగా చికిత్స అందించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

రాజీనామా చేయాలి

తెలంగాణలో 22 మెడికల్ కళాశాలల్లో 12 వేల బెడ్లు ఉన్నాయని, అవి మంత్రులు మల్లారెడ్డి, ఈటల, హరీశ్​ రావులకు చెందిన కళాశాలలు అయినందున రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. వైద్య శాఖలో మంత్రికి, డీహెచ్‌కు మధ్య పొసగడం లేదని, మంత్రి పర్యవేక్షణలో పని చేయాల్సిన శ్రీనివాసరావు లెక్క చేయడం లేదని తెలిపారు. ఈటల తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హెటిరో డ్రగ్స్‌కు మంత్రి కేటీఆర్‌కు లావాదేవీలు ఉన్నందునే రెమిడెసివిర్‌ను బ్లాక్ చేసి అమ్ముతోందని ఆరోపించారు.

ఇదీ చూడండి : ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.