ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. నీటి కేటాయింపు గెజిట్‌పై ప్రధానికి ఆయన అభినందనలు తెలిపారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో ప్రస్తావించారు.
కార్పొరేషన్ల విభజనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలపైనా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ప్రాచీనమైన తెలుగుభాషా పరిరక్షణకు ఉపయోగపడే తెలుగు అకాడమీకి..సంస్కృతం పేరు కలపడాన్ని.. ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.
ఇదీ చదవండి: REVANTH REDDY: ‘సీఎం బినామీ సంస్థలే వేలంలో పాల్గొన్నాయి’