MP Laxman Fires on KCR : తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారని.. బీరు, బిర్యానీ కోసం కాకుండా మోదీ ప్రసంగానికి వచ్చి సభను విజయవంతం చేశారని రాజ్యసభ సభ్యుడు డా.లక్మణ్ అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని అంటే గౌరవం లేకుండా మాట్లాడిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు.
MP Laxman On BRS Govt : తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబం అయితే దళితుడిని ఎందుకు సీఎం చేయలేదని లక్ష్మణ్ ప్రశ్నించారు. దళితుడు మీ కుటుంబ సభ్యుడు కాదా అంటూ కేసీఆర్‌ను లక్ష్మణ్ ప్రశ్నించారు. పార్టీలో సీఎం, అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పదవుల్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉన్నారని.. బీసీ.. ఎస్టీ మహిళకు ఒక్క పదవి ఇవ్వలేదని.. ఇదేనా మహిళలకు బీఆర్ఎస్ ఇచ్చే ప్రాధాన్యత అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమకారులు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కారా అని లక్ష్మణ్ అడిగారు.
Laxman fires on KTR : 'దమ్ముంటే ఆ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయండి'
MP Laxman Slams KCR Government : మద్ధతు ధర అడిగిన రైతుల చేతులకు బేడీలు వేశారని.. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని అధికారులను వారిపై ఉసిగొల్పి దాడులు జరిపించారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులు, బీసీలు, ఎస్టీలు మీ కుటుంబ సభ్యులు కాదా అని ధ్వజమెత్తారు. వాళ్లు మీ కుటుంబ సభ్యులే అయితే ఎందుకు పరీక్షలు సరిగ్గా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా.. అవినీతి అక్రమాలకు పాల్పడినవారిని కాపాడుతున్నారని ఆరోపించారు. 30 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని... కేవలం మద్యం వల్లనే రూ.6వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్ల వరకు ఆదాయం పెంచుతున్నారని.. దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మండిపడ్డారు.
కేసీఆర్ సర్కార్.. ప్రజలకు రెండు వేలు ఇచ్చి పదివేలు కొట్టేస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అన్యాయాలు తప్ప ఏమున్నాయని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని వస్తే మమతా బెనర్జీ లాంటి వారే స్వాగతం పలకడానికి వస్తారని.. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రారని మండిపడ్డారు. ప్రధాని వస్తున్నప్పుడే కేసీఆర్‌కు జ్వరం, జలుబు వస్తాయని ఎద్దేవా చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలంగాణకు కేసీఆర్ తలవంపు తెస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని రూ.9 కోట్ల నిధులు ఇస్తే కేసీఆర్ ఏమీ చేయనట్టు వ్యవహరిస్తున్నారాని మండిపడ్డారు. పసుపు బోర్డు ద్వారా తెలంగాణకు ప్రధాని ఎంత మేలు చేశారో తెలుసా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని కేసీఆర్ సహించలేకపోతున్నారని.. గిరిజన యూనివర్సిటీకి కేసీఆర్ భూమి కేటాయించక పోవడం వల్లే ఆలస్యం అయిందని... ఇప్పుడు మోదీ పట్టుదలతో ములుగులో వర్సిటీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇది కేవలం ట్రైలరేనని.. అసలు సినిమా ముందుముందు చూపించబోతున్నామని అన్నారు.
MP Laxman Clarifies on BJP First List : "ఎలాంటి అభ్యర్థుల జాబితా ప్రకటించలేదు.. అదంతా ఫేక్ ప్రచారం"