ETV Bharat / state

ప్రగతిభవన్​లో పడుకునే నాయకుడు కావాలా? - ప్రజల కోసం పని చేసే మోదీ కావాలా? - బీజేపీ మేనిఫెస్టోపై ఎంపీ లక్ష్మణ్​

MP Laxman Comments on KCR : బీసీను ముఖ్యమంత్రి చేస్తానంటే బీఆర్ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎంపీ లక్ష్మణ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను తగిన విధంగా ఉంటుందని తెలిపారు. విజయశాంతి పార్టీని వీడి వెళ్లరని విశ్వాసం వ్యక్తం చేశారు.

MP Laxman Fires on Revanth Reddy
MP Laxman on BJP Manifesto 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2023, 2:00 PM IST

MP Laxman Comments on KCR : రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీలు బీఆర్ఎస్​, కాంగ్రెస్​లని ఎంపీ లక్ష్మణ్​ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ప్రజల హితం కోరేవి కావని అన్నారు. కేసీఆర్​కు రెండుసార్లు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను.. బిక్షమెత్తుకునేలా చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్​కు మరోసారి అవకాశం ఇస్తే ఏమీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పదేళ్లలో ఒక్క రేషన్​ కార్డు ఇవ్వని కేసీఆర్​.. రేషన్ కార్డు గురించి ఎన్నికల కమిషన్​కు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తానంటే ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరని.. ఇది కేవలం ఎన్నికల వ్యూహమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Laxman Fires on Revanth Reddy : బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, మజ్లీస్​ పార్టీలు ఒప్పందంతో పని చేస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్​లో 59 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఒక్కరూ పార్టీలో ఉండరని, ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్​ కండువా కప్పుకుంటారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్(Karnataka Congress) ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని వ్యాఖ్యానించారు. తమలా మోసపోవద్దని కర్ణాటక రైతులు కోరుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బీసీలంటే చిన్నచూపు బీజేపీ రెండో జాబితాలో వారికే అధిక ప్రాధాన్యం : లక్ష్మణ్

"పెట్రోల్, డీజిల్ పైన పది రూపాయలు తగ్గించని కేసీఆర్.. రూ.450కే గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ప్రజలు నమ్మరు. ప్రగతి భవన్​లో పడుకునే నాయకుడు కావాలా.. ప్రజల కోసం పని చేసే మోదీ కావాలా? తెలంగాణ అభివృద్ధిలో భాగంగా మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుంది."- లక్ష్మణ్​, ఎంపీ

ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బీజేపీ మేనిఫెస్టో ఉంటుంది

MP Laxman on BJP Manifesto 2023 : బీజేపీ బీసీలను ముఖ్యమంత్రి చేస్తానంటే.. కాంగ్రెస్​, బీఆర్ఎస్​ చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ హెచ్చరించారు. మైనార్టీ ఓట్ల కోసం ఇరు పార్టీలు హిందువులను అపహేళన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మోదీ అంటే ఒక వసుదైక కుటుంబమని కొనియాడారు. 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ(SC Classification) పోరాటానికి మోదీ పరిష్కారం చూపారని తెలిపారు. బీఆర్ఎస్​కు ఎస్సీ వర్గీకరణపై మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వర్గీకరణలో శాశ్వత పరిష్కారం చూపుతామని హమీ ఇచ్చారు. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే జరగదని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు విజయశాంతి(BJP Leader Vijayashanthi) పార్టీనీ వీడరని విశ్వాసం వ్యక్తం చేశారు.

'వేలంపాట మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్​లు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు'

'పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యింది'

BJP MP Laxman Fires on KTR : "కేటీఆర్​ స్థాయికి మించి మాట్లాడుతున్నారు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.