లోక్‌సభ జీరో అవర్‌లో తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన నవోదయ పాఠశాలల అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. గత ఆరేళ్ల నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యక్తిగతంగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ హామీ కూడా ఇచ్చారని అన్నారు. ఇప్పటివరకు తెలంగాణలోని 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు లేవని వివరించారు. వీలైనంత త్వరగా నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మౌలిక సదుపాయాలు, భూమి కేటాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కొత్త ప్రభాకర్ రెడ్డి సభకు తెలిపారు.
ఇదీ చూడండి : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మండలి ఛైర్మన్ గుత్తాకు మధ్య ఆసక్తికర చర్చ