తన పార్లమెంటు నియోజకవర్గంలోని భువనగిరి, ఆలేరు, రామన్నపేట, చిట్యాల, జనగాం రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను ఆపాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌కు లేఖ రాశారు. ఇవాళ చర్లపల్లి శాటిలైట్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ వచ్చిన గోయల్‌కు కాంగ్రెస్ నేతలు ఆ లేఖ ప్రతిని అందజేశారు.
లేఖలో ఏముందంటే..!
భువనగిరి రైల్వే స్టేషన్లో శాతవాహన, పద్మావతి, కోాణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని.. తద్వారా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపార వర్గాలకు సౌకర్యవంతంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
రామన్నపేట స్టేషన్లో చెన్నై ఎక్స్‌ప్రెస్, శబరి, కాకినాడ, డెల్టాఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను, ఆలేరులో కోణాార్క్, కాకినాడ-షిరిడీ, నాగవల్లి, నాందేడ్, పద్మావతి రైళ్లను నిలపాలని కోరారు.
జనగాం రైల్వే స్టేషన్లో నాందేడ్, చార్మినార్, నర్సాపూర్, నాగర్సోల్, విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఆయా రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపితే.. తన పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజా రవాణా మరింత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రిని కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ