MP Komati Reddy Venkat Reddy Demand : తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో మంత్రి పదవికే రాజీనామా చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డితో వైరం పెంచుకున్నారు. తరచూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన, ఆయన సోదరుడు రాజగోపాల్(Rajgopal Reddy) రెడ్డిలు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగింది. కాని వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరారు. చివరకు మునుగోడు ఎన్నికల్లో పరోక్షంగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఓట్లు వేయాలని.. నియోజక వర్గంలో తనకు దగ్గరగా ఉన్న వారికి ఫోన్ చేసి చెప్పిన ఆడియో లీకై కలకలం రేగింది. కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించకపోవడం, ఏదొక అభివృద్ధి పేరుతో తరచూ బీజేపీ మంత్రులతో, ప్రధానితో కలవడం, ఏఐసీసీ ఇచ్చిన కార్యక్రమాలల్లో పాల్గొనకపోవడం.. ఘటనలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఎక్కువగా కలవకుండా ఉండడం.. రేవంత్ రెడ్డితో పాటు ఇంచార్జిలపై వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయడం తరచూ జరుగుతూ వచ్చాయి.
AICC Secretary Meet Komati Reddy Venkat Reddy : సీడబ్ల్యుసీ జాబితాలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిలకు స్థానం కల్పలించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఇదిలా ఉండగా ఉన్నఫలంగా కాంగ్రెస్ 16 మంది సభ్యులతో ప్రకటించిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి అందులోనూ చోటు కల్పించారు. అప్పటి వరకు బాగానే ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తనను అధిష్ఠానం తక్కువ చేసి చూస్తోందని, ప్రాధాన్యత ఇవ్వలేదని భావించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో ప్రదేశ ఎన్నికల కమిటీలో పాల్గొన్న కోమటిరెడ్డి ఆ సమావేశంలో సీడబ్ల్యుసీ సభ్యులుగా ఎంపికైన దామోదర్ రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డిలకు సన్మానం చేయడంతో.. ఆ సమావేశం నుంచి ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. అప్పటి నుంచి గాంధీభవన్‌లో జరిగే పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన ఊర్లోనే ఉండి.. కార్యక్రమాలకు రాకపోవడంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే ఆరా తీశారు. దీంతో ఆయనకు ఫోన్ చేయించగా తనలో ఉన్న ఆందోళన అంతా బయటపెట్టారు.
Venugopal Call to Komati Reddy Venkat Reddy : వెంకటరెడ్డి అలకబూనినట్లు తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. బుజ్జగించే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇవాళ ఠాక్రే ఫోన్‌లో మాట్లాడగా, ఉదయం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ కోమటిరెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కోమటిరెడ్డి వినే పరిస్థితి లేకపోవడంతో కేసీ వేణుగోపాల్‌తో మాట్లాడించారు. అయినా కూడా బెట్టు వీడలేదు. తనకు ఏ కమిటీలో కూడా స్థానం కల్పించలేదని ఆరోపించారు. అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బెట్టు వీడే అవకాశం లేకపోవడంతో మధ్యాహ్నం రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాక్రే(Takre ) వెళ్లగా.. ఆ తరువాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లారు. దాదాపు గంటపాటు వెంకటరెడ్డితో చర్చించారు. అయినా బెట్టు వీడలేదని తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో నేరుగా కలిసి చర్చించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతో వెంకటరెడ్డి కలిసి ఏదైనా ఉన్నత స్థాయి కమిటీలో తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
ఎంపీ వెంకట్‌రెడ్డిపై.. ఠాక్రేకు ఫిర్యాదు చేసిన చెరుకు సుధాకర్
Komatireddy fires on CM KCR : 'కలిసికట్టుగా ఉన్నాం.. ఎన్నికల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం'