MP Dharmapuri Arvind Fires on BRS: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పెట్టే ఖర్చు వంద కోట్లకు తీసుకు వెళ్లిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. కవిత తలుచుకుంటే మైక్ టైసన్‌కు బాక్సింగ్, విరాట్ కోహ్లీకి క్రికెట్ నేర్పుతుందని ఎద్దేవా చేశారు. తనను వెంటాడి వేటాడి నా మీద నిలబడతానన్న కవిత.. ఇప్పుడు తండ్రి ఎక్కడ చెప్తే అదే అంటోందని దుయ్యబట్టారు.
ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో అరవింద్ మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన రావాలంటే బీజేపీ రావాలన్నారు. బీఆర్ఎస్‌గా టీఆర్ఎస్‌ను మార్చింది కాంగ్రెస్‌తో కలిసేందుకేనని ఆయన ఆరోపించారు. తెలంగాణ మొత్తాన్ని కేసీఆర్‌కు అప్పగించాలన్న డీల్‌ను కాంగ్రెస్‌తో కుదుర్చుకున్నారని ఆరోపించారు.
బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున మీరు గెలిపించి ప్రభుత్వంలో కుర్చో పెట్టే నిర్ణయం తెలంగాణ సమాజం తీసుకున్నాట్టు స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ గమనించి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే తెలంగాణలో ఏమాత్రం ఐనా మళ్లి టీఆర్ఎస్ పార్టీ గెలవాలా, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటుకి దగ్గరదగ్గరలో ఉండలి అన్నా, కాంగ్రెస్ పార్టీతోటి కలవక తప్పదు. -అరవింద్, ఎంపీ ధర్మపురి
ఇవీ చదవండి: