ETV Bharat / state

'కరోనాను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు' - జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్

కరోనా నియంత్రణకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తమవంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ అల్వీన్ కాలనీలోని ప్రజలకు హోమియోపతి మందులు అందజేశారు.

bb patil distributed homeopathy medicines
హోమియోపతి మందుల పంపిణీ చేసిన ఎంపీ బీబీ పాటిల్
author img

By

Published : Aug 3, 2020, 12:21 PM IST

జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సహకారంతో ప్రగతిశీల వీరశైవ సేవా సంఘం వారు హైదరాబాద్ అల్వీన్ కాలనీలో కరోనా నివారణకు తోడ్పడే హోమియోపతి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా నివారణకు మందును వాడటమే కాకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు, శానిటైజర్​లు వాడాలని ఆయన సూచించారు.

నిర్లక్ష్యాన్ని వీడకపోకే కరోనా మహమ్మారి కాటుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల వీరశైవ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మల్లికార్జున, బద్రీనాథ్, కార్యదర్శి వి.ఆర్ విజయ, బోర్డు సభ్యులు శ్రీకాంత్, సలహాదారు రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.