ముషీరాబాద్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పరిశీలించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భోలక్‌పూర్ ప్రజల కాలుష్య నీటి సమస్యకు నిర్మాణాత్మక ప్రణాళికతో శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. డివిజన్లోని పలు కాలనీల్లో ఎంపీ, కార్పొరేటర్ అఖిల్ అహ్మద్ పర్యటించారు. కలుషిత నీటి సమస్య వల్ల 14మంది మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఏడు కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజీ పైపులైను నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. భోలక్‌పూర్ ప్రజలకు 12 కోట్ల రూపాయలతో మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పైపులైను నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు.