కరోన వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మత పెద్దలు ఇప్పటికే ప్రజలకు తగు సూచనలు చేశారు. ముస్లింలు నమాజ్ చేసుకోవడం కోసం మసీదులకు రాకుండా ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని సూచించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రజలు అందరు ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని, తాను కూడా మసీద్‌కు వెళ్లకుండా తన ఇంట్లోనే నమాజ్ చేసుకుంటున్నాని తెలిపారు.
అలాగే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ కూడా ముస్లిం సోదరులు ఎవరూ శుక్రవారం, తమ రోజు వారీ నమాజ్ కొరకు మసీదుకు వెళ్లకూడదని వెల్లడించిందన్నారు.
ఇటలీ, అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయన్నారు. మన దేశంలో కరోనా వ్యాప్తి అధికమైతే ఆపడం ఎవరివల్లా కాదని.. అందరు ప్రజలు దీని గుర్తుంచుకుని ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పాటించాలని ఎంపీ కోరారు. స్వీయ నిర్బంధంలో ఉండి మిమ్మల్ని.. మీ కుటుంబ సభ్యుల్ని.. చుట్టూ ఉన్న వారి ప్రాణాలను కాపాడుకోండని అసదుద్దీన్ సూచించారు.
ఇవీ చూడండి: పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?