దేశంలో జరుగుతున్న అవినీతికి సీఎం కేసీఆర్‌కు ప్రమేయం ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. దిల్లీలో ఆప్ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందని పేర్కొన్నారు. కవిత.. దిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందని వెల్లడించారు. పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారని తెలిపారు. ఫీనిక్స్‌పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయన్నారు. త్వరలో కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుందని అభిప్రాయపడ్డారు.
దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉంది. ఎమ్మెల్సీ కవిత దిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించింది. అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది కవిత. పంజాబ్ రైతుల పేరుతో కేసీఆర్ పర్యటనలు చేశారు. కవిత విషయంలో కేటీఆర్ ఏమీ మాట్లాడుతలేరు. ఫీనిక్స్ పైన సీబీఐ దాడులు జరుగుతున్నాయి. కేటీఆర్ బాగోతం కూడా బయటకు వస్తుంది. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఈడీ, సీబీఐలో ఇరుక్కుపోయారు. సీబీఐ విచారణలో కవిత ముద్దాయిగా తేలుతుంది. తక్షణమే కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా... - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
ఇవీ చదవండి..