ETV Bharat / state

"క్యూనెట్​"కు ప్రచారం చేయలేదు.. సినీనటుల వివరణ

క్యూనెట్​"కు ప్రచారం చేయలేదని సినీనటులు వివరణ ఇచ్చారు. ఆ సంస్థకు తమకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.

క్యూనెట్​ సంస్థ
author img

By

Published : Aug 28, 2019, 11:24 PM IST

గొలుసుకట్టు వ్యాపారంతో వివాదాల్లో చిక్కుకున్న క్యూనెట్‌ సంస్థకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ సంస్థతో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని... సంస్థ తరఫున తాము ప్రచారం చేయలేదని పలువురు సినీ ప్రముఖులు సైబరాబాద్​ పోలీసులకు వివరణ ఇచ్చారు. క్యూనెట్​ గతంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పలువురు టాలీవుడ్​, బాలీవుడ్​ నటులు పాల్గొన్న అంశంపై సైబరాబాద్​ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సినీ నటులు షారుఖ్​ఖాన్​, బొమన్​ఇరానీ, వివేక్​ఒబెరాయ్​, పూజాహెగ్డే, అల్లు శిరీష్​, క్రికెటర్ యువరాజ్​సింగ్​లకు తాఖీదులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంస్థ తరఫున తాము ప్రచారం చేయలేదని వివరణ ఇచ్చారు. దీనిపై వాస్తవాలను సైబరాబాద్​ పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి : మద్యం మత్తులో డ్రైవర్..ముగ్గురు విద్యార్థులు మృతి

Intro:సికింద్రాబాద్ యాంకర్ ...ఓల్డ్ బోయిన్పల్లి లోని సిండికేట్ బ్యాంక్ కాలనీ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..సిలిండర్ పేలడంతో కిరాణా సామాగ్రిని ప్లాస్టిక్ వస్తువులు పొందుపరిచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ..ఈ గోదాం లో పొందుపరచిన వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి..సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు..కోటి రూపాయల విలువైన కిరణ సామాగ్రి దగ్ధం అయినట్లు వారు చెబుతున్నారు..దట్టంగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.. Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.