Mother Complaint on Son: ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దివంగత పులపర్తి నారాయణమూర్తి సతీమణి వెంకటలక్ష్మి.. తన కుమారుడు రవి కుమార్‌పై స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆమె.. రవి కుమార్ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. ఈ నెల 7న ఏడుగురు అనుచరులతో ఇంటికి వచ్చి.. దౌర్జన్యంగా కారు, జీపు తీసుకెళ్లాడని తెలిపింది. తన భర్తను ఇబ్బంది పెట్టి ఆస్తులు రాయించుకున్నాడని పేర్కొంది. రవి కుమార్ నుంచి ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది.
ఇవీ చదవండి: ఈ నెల 16 నుంచి యాదాద్రిలో ధనుర్మాసోత్సవాలు
గన్‌ఫైర్ చేస్తూ డుగ్గు డుగ్గు బుల్లెట్ బండిపై వచ్చిన పెళ్లి కూతురు