ETV Bharat / state

నిబంధనలు లేని పబ్​లు... ఆందోళనలో నగరవాసులు - most of the pubs in hyderabad are running without ghmc and police permissions

కనీస నిబంధనలు, సమయపాలన లేకుండా పబ్బులు నడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. పబ్బుల నుంచి బయటకొచ్చి మందుబాబులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మద్యం దుకాణాల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తోన్న పోలీసులు... పబ్​ల విషయంలో మాత్రం చూసీ చూడకుండా వ్యవహరిస్తున్నారు.

నిబంధనలు లేని పబ్​లు... ఆందోళనలో నగరవాసులు
author img

By

Published : Jul 7, 2019, 2:06 PM IST

నిబంధనలు లేని పబ్​లు... ఆందోళనలో నగరవాసులు

హైదరాబాద్​లో ఉన్న పబ్​లన్నీ దాదాపు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ పబ్​ల వల్ల ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించే వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ ప్రాంతంలో మద్యం బాబుల హంగామా ఉంటుంది. బడి, గుడికి దూరంగా వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి సమీపంలోనే ఓ పబ్​ ఏర్పాటు చేశారు.

అనుమతి లేకున్నా!

ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతాల్లో పబ్​ల ఏర్పాటు విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. బార్​ల పేరుతో అనుమతి తీసుకొని పబ్​లు నిర్వహిస్తున్నట్లు విమర్శలున్నాయి. చాలా పబ్​లకు జీహెచ్ఎంసీ అనుమతి కూడా లేదు. పబ్ నిర్వాహకులు సైతం పార్టీల పేరుతో వేలల్లో డబ్బులు గుంజుతున్నారు. ఇటీవలి ఓ పబ్​లోడబ్బు చెల్లింపుల విషయంలో తలెత్తిన చిన్నపాటి వివాదం... దాడికి దారి తీసింది. యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... బౌన్సర్ల ఆగడాలపై పశ్చిమ మండల డీసీపీ ప్రత్యేక దృష్టి సారించారు.

పట్టించుకోరా!

పబ్​లలో హుక్కా విక్రయం, మైనర్ల ప్రవేశం, చెవులు చిల్లులు పడేలా శబ్దం, అశ్లీల నృత్యాలు సర్వ సాధారణం. ఓ పబ్​లో నృత్యం చేసే ఓ మహిళ.... తనను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని నిర్వాహకులపై ఫిర్యాదు చేసింది. ఇలా పాశ్చాత్య సంస్కృతి పేరుతో పబ్​లలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నా పట్టించుకునే వాళ్లేలేరు.

చర్యలు తీసుకోండి...

పబ్బుల వద్ద ఘర్షణలు, బౌన్సర్ల దాడులు, బాధితుల ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.