ETV Bharat / state

వైద్యులు, నర్సుల కొరతతో ఇక్కట్లు... 25 శాతం కొవిడ్ బాధితులే

హైదరాబాద్‌ నిమ్స్‌లో గత నెల రోజుల్లోనే సుమారు 25 మంది వైద్యులు, 60 మంది నర్సులు కొవిడ్‌ బారినపడ్డారు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిలో సుమారు 200 మందికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇక్కడ రోజుకు కనీసం 8-10 మంది వైద్యసిబ్బంది పాజిటివ్‌లుగా నిర్ధారణ అవుతున్నారు. సేవలందించిన ఆసుపత్రిలోనే వీరు చికిత్సలు పొందుతున్నారు. నిమ్స్‌లో రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని.. ఒక వైద్యుడు పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 10 రోజుల్లోనే కోలుకొని తిరిగి సేవలందించడం విశేషం.

most-of-the-doctors-and-medical-staff-affected-by-covid
వైద్యులు, నర్సుల కొరతతో ఇక్కట్లు... 25 శాతం కొవిడ్ బాధితులే
author img

By

Published : Apr 17, 2021, 7:03 AM IST

మహమ్మారి వైద్య సిబ్బందిని ముప్పు తిప్పలు పెడుతున్నా నిమ్స్‌లో ఇప్పటికీ అన్ని రకాల స్పెషాలిటీ సేవలను నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ రెండోదశలో ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. వైద్యసిబ్బంది కూడా కొవిడ్‌ కోరల్లో చిక్కుకుంటున్నారు. నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సహాయక సిబ్బంది సహా సుమారు 25% మంది బాధితులుగా నిర్ధారణ అవుతున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ప్రభుత్వ వైద్యంలోనే కాదు.. ప్రైవేటులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కొవిడ్‌ సేవలు అందించడానికి వైద్యులు, నర్సులు తదితర సిబ్బంది కొరత ఏర్పడుతోంది.

ఎందుకింత తీవ్రత?

తొలిదశ ప్రారంభంలోనే లాక్‌డౌన్‌ విధించారు. అప్పుడు సాధారణ శస్త్రచికిత్సలు, ఓపీలు నిలిచిపోయాయి. అందువల్ల కేవలం అత్యవసర వైద్యానికి మాత్రమే ఆసుపత్రులకు వెళ్లేవారు. దాంతో అప్పుడు వైద్యులు, నర్సులు ఇప్పటిలాగా ఎక్కువమంది కొవిడ్‌ బారిన పడలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పటికీ సాధారణ ఓపీ సేవలు, ముందస్తుగా ఎంపిక చేసుకున్న శస్త్రచికిత్సలు కొనసాగుతున్నాయి. సాధారణ రోగులు పెద్దసంఖ్యలోనే ఆసుపత్రులకు వస్తున్నారు. ఇదే సమయంలో నెలరోజులుగా వైరస్‌ విజృంభిస్తోంది. పరీక్షల కోసం, టీకాల కోసం ఆసుపత్రులకొచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. పైగా ఇప్పుడు వ్యాప్తి చెందుతున్నది ‘డబుల్‌ మ్యూటెంట్‌ వైరస్‌’ అని నిపుణులు చెబుతున్నారు. అతి వేగంగా వ్యాప్తి చెందే గుణమున్న ఈ వైరస్‌.. అతి తక్కువ సమయంలోనే అక్కడ గుమిగూడిన ఎక్కువమందికి సోకుతోంది. వైద్యులు సహా సిబ్బంది అందరూ ‘వైరస్‌ ముప్పు పొంచి ఉన్న అతి ప్రమాదకర ప్రాంతంగా’ గుర్తించిన ఆసుపత్రుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఓపీలో కరోనా బాధితులెవరో, కానివారు ఎవరో కూడా తెలియని స్థితిలో రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. రోగులు మాస్కు ధరించకుండా.. దగ్గడం, మాట్లాడటం ద్వారా ఆ ప్రదేశంలో వైరస్‌ జాడలను వదిలి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆ ప్రదేశాన్ని తాకినా, అక్కడి గాలిని పీల్చాల్సి వచ్చినా.. అనివార్యంగా ఏదో ఒక సందర్భంలో వైద్యసిబ్బంది కొవిడ్‌ బాధితులుగా మారుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అదనపు నియామకాలపై దృష్టి

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రస్తుతం 30-40 శాతం పడకలను మాత్రమే కొవిడ్‌ కోసం కేటాయించారు. వీటి సంఖ్య పెంచాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశించడంతో త్వరలోనే మరికొన్ని పడకలను పెంచడానికి ఆసుపత్రుల్లో సన్నాహాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతమున్న కొవిడ్‌ పడకల్లో చికిత్సలందించడానికి ఆసుపత్రులు తమ సిబ్బందిలో 50 శాతం మందిని కేటాయించాయి. ఎందుకంటే కొవిడ్‌ వార్డుల్లో పీపీఈ కిట్లు ధరించి సేవలందించాల్సి ఉంటుంది. 6 గంటల కంటే ఎక్కువ సేపు అలా విధులు నిర్వర్తించలేని పరిస్థితులుంటాయి. అందుకే ఇక్కడ పనిచేసే వారిని గ్రూపులుగా విభజించి, 3 షిఫ్టుల్లో సేవలందించేలా ఆసుపత్రులు ప్రణాళికలు రూపొందించాయి. ఈ క్రమంలో ఒక్కరు కొవిడ్‌ బారినపడినా.. ఆ వ్యక్తి 2 వారాల వరకూ విధుల్లోకి రావడానికి వీల్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో సేవలందించే వారిలో 25 శాతం మంది ఒకేసారి మహమ్మారి కోరల్లో చిక్కుకుంటే వైద్యసేవలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో అదనపు నియామకాలపై ఆసుపత్రులు దృష్టిపెట్టాయి. ప్రత్యేకంగా కొవిడ్‌ సేవల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించే వారికి.. సాధారణ వేతనం కంటే సుమారు 50-100 శాతం వరకూ అధికంగా ఇవ్వడానికి ప్రైవేటు ఆసుపత్రులు మొగ్గుచూపుతున్నాయి. ముఖ్యంగా డ్యూటీ డాక్టర్‌, నర్సుల కొరత తీవ్రంగా ఉండటంతో.. నియామక సంస్థలను సంప్రదిస్తున్నాయి. డ్యూటీ డాక్టర్లుగా సేవలందించేందుకు ఎంబీబీఎస్‌, ఆయుర్వేద వైద్యులను కూడా వినియోగించుకుంటున్నాయి. కొవిడ్‌ ఉధ్ధృతి ఇలాగే కొనసాగితే.. పడకలు దొరకకపోవడమే కాదు.. వైద్యులు, నర్సుల కొరత కూడా ఏర్పడే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి: వైద్య ఆరోగ్య సిబ్బందికి సెలవుల రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.