ETV Bharat / state

బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటాం : ఎర్రోళ్ల శ్రీనివాస్‌ - కమిషన్‌ పనితీరుపై ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ప్రశంసలు

కేసులను పరిష్కరించడలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తెలిపారు. కేవలం మూడేళ్లలోనే మెరుగైన పనితీరు కనబరిచినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ నాంపల్లి‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Most cases solved by sc st commission in state says by chairman errolla srinivas in hyderabad
బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటాం : ఎర్రోళ్ల శ్రీనివాస్‌
author img

By

Published : Feb 23, 2021, 10:46 PM IST

బాధితులకు ఎల్లవేళలా పూర్తి అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. కేసులను పరిష్కరించడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన మూడేళ్లలోనే 99 శాతం కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ నాంపల్లి‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

బాధితులకు ప్రభుత్వం తరఫున 13,905 కేసుల్లో రికార్డు స్థాయిలో రూ.78.30 కోట్ల పరిహారం ఇప్పించామని తెలిపారు. జనగామ జిల్లాలోని పిట్టలోని గూడెం, నక్కలోని గూడెంకు చెందిన సంచార జాతులకు కమిషన్ చొరవతో రేషన్ కార్డులు, కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా సిండికేట్ బ్యాంకులో ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న 950 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : రేపట్నుంచే 6,7, 8 తరగతులు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.