హైదరాబాద్ లాక్డౌన్లో కొన్ని నిబంధనలను సర్కార్ సడలించింది. ఈ క్రమంలో రెండ్రోజుల నుంచి రోడ్లపై వాహనాల రాకపోకలు పెరిగాయి. ఇదే అదనుగా భావించి కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారు.
సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన వారిని పోలీసులు పట్టుకుని వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో రెండు గంటల్లోనే సుమారు వేయికి పైగా వాహనాలను పోలీసులు జప్తు చేశారు. లంగర్ హౌస్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో 500కు పైగా వాహనాలు స్వాధీనం చేసినట్లు అధికారులు తెలిపారు.