ETV Bharat / state

జీహెచ్​ఎంసీలో కరోనా డేంజర్​ బెల్స్​ - జీహెచ్​ఎంసీలో కరోనా కేసులు 214

కరోనా మహమ్మారి జీహెచ్​ఎంసీ పరిధిలో రోజు రోజుకు జడలువిప్పుతోంది. ఇటీవలి కాలంలో నిత్యం 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. తాజాగా కింగ్ కోఠి ఆస్పత్రి ఇంఛార్జి సూపరింటెండెంట్​ కరోనా బారిన పడగా... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతకు మహమ్మారి సోకింది.

More Corona Cases in GHMC on Wednesday
జీహెచ్​ఎంసీలో కరోనా డేంజర్​ బెల్స్​
author img

By

Published : Jun 18, 2020, 5:22 AM IST

జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త ప్రాంతాలకు కూడా వైరస్‌ విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఒక్కరోజే 214 కేసులు నమోదు కావడం గమనార్హం.

గాంధీ భవన్​లో కరోనా కలకలం

బంజారాహిల్స్ పీఎస్​లో ఓ ఎస్సైతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్​కి కరోనా నిర్ధరణ అయింది. కోఠి ఈఎన్​టీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ శంకర్​కి కరోనా సోకింది. ఆయన ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డికి కరోనా సోకగా... నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

80 శాతం కేసులు ఇక్కడే...

లాక్​డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా మహమ్మారి భాగ్యనగర పరిధిలో భారీగా విస్తరిస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే ఉంటుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. దీనివల్ల గ్రేటర్​ పరిధిలో పది రోజుల్లోనే దాదాపు 50వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు. శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, ఎల్​బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో శాంపిల్స్​ సేకరణ కొనసాగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.