ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కరోనా కలకలం రేపుతోంది. నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేసే ఒక ఎస్సైకి పాజిటివ్ అని తేలింది. ఆయనతో సన్నిహితంగా వారిని క్వారంటైన్‌కు తరలించారు. విజయవాడలో వేర్వేరు పోలీసు స్టేషన్లో పనిచేసే ఇద్దరు ఎస్సైలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అదే ఇంట్లో మరో ఇద్దరు కానిస్టేబుళ్లూ ఉంటున్నారు. ఒక ఎస్సైకి దగ్గు వస్తుండటంతో నాలుగు రోజుల క్రితం పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ అని వచ్చింది. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చిన్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ఇంట్లో ఉండే వారిని క్వారంటైన్‌కు పంపించారు.
రెండు పోలీస్ స్టేషన్లలోని దాదాపు 60 మంది సిబ్బందికి పరీక్షలు చేయించారు. నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది.అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను దిశ స్టేషన్ ఎస్సై తన వాహనంలో మానవతా దృక్పథంతో ఆసుపత్రికి తరలించారు. ఆమె అక్కడ మృతి చెందారు. అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ ఎస్సై స్టేషన్లో రెండు రోజులు విధుల్లో ఉన్న ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు 30మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. కృష్ణా జిల్లాలో కేసుల సంఖ్య వందకు దాటింది. ఒకే రోజు 14 కేసులు రావటంతో...88ఉన్న సంఖ్య 102కు పెరిగింది. కొత్త కేసులన్నీ విజయవాడ నగరంలోనివే.!