అటు ఓ వానర సమూహం... ఇటు ఓ వానర సమూహం. ఇరు వర్గాల మధ్య సంవాదం. ఫలితంగా... అరగంటకు పైగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. తెరవెనుక ఏం జరిగిందో ఏమో... ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గ నియోజకవర్గ కేంద్రంలో రెండు వానర సమూహాలు భీకర యుద్ధానికి దిగాయి. అనంతపురం - కల్యాణదుర్గం ప్రధాన రోడ్డు డివైడర్‌పై యుద్ధానికి కాలు దువ్వుకున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ తతంగమంతా అక్కడున్న ప్రజలు కాస్త ఆనందంతో, ఆసక్తితో తిలకించగా ట్రాఫిక్‌కు పెద్ద అంతరాయం కలిగింది. చివరికి ఓ గుంపు.. ఎక్కువగా బెదిరించగా.. ఈ వానర బాహుబలుల యుద్ధం ఆగిపోయింది.
ఇవీ చూడండి: హీరో నాగశౌర్యకు రూ.500 జరిమానా