నేడే చూడండి. కదిరిలో కోతుల గోల. ఇప్పుడు తప్పిదే మరోసారి ఇంతటి వినోదం దొరకదు... అని చెప్పుకొనేంత స్థాయిలో కోతులు గోల గోల చేశాయి. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలో ఆగమాగం చేశాయి. వీధిన పడి గొడవపడ్డాయి. కోతి గోల అన్న మాటకు అందరికీ అర్థం చెప్పినట్టుగా.. కోతి మూక అంటే ఏంటో చూపించడానికి వచ్చినట్టుగా.. షో చేశాయి. వీధుల్లో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తిరుగుతూ జనాన్ని సైతం ఆందోళనకు గురి చేశాయి. బస్తీ మే సవాల్ అన్నట్టుగా తలపడ్డాయి.
కాసేపు రెండు బృందాలుగా విడిపోయి దాడి చేసుకున్నాయి. అంతలోనే.. ఒకదానిపై మరోటి పడి గొడవపడ్డాయి. ఓ కోతిని చూసి మరో కోతి అలాగే చేస్తుండడంతో.. అక్కడున్నవాళ్లు.. ఎక్కడ ఈ కోతులు తమమీద పడతాయో అని భయపడాల్సి వచ్చింది. ఓ గంటపాటు తగవు పడ్డ కోతులు.. ఆఖరికి పట్టణ శివారుకు వెళ్లిపోయాయి. ఈ హంగామాను ఓ వ్యక్తి వీడియో తీయడంతో.. కదిరిలో కోతి గోల ఇలా బయటికొచ్చింది. అందరికీ వినోదం పంచుతోంది.
ఇదీ చూడండి: BOGATHA WATERFALLS: ఉరకలెత్తుతున్న బొగత జలపాతం.. అందాలు చూసొద్దామా.!