హైదరాబాద్ సైదాబాద్ పోలీస్స్టేషన్లో మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. సింగరేణి కాలనీకి చెందిన సాయి అరవింద్ నవంబర్‌లో మై బ్యాంక్ అనే యాప్ నుంచి రుణం తీసుకున్నాడు. డబ్బులు తిరిగి చెల్లించేందుకు కొన్ని రోజుల సమయం అడిగినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు.
కంపెనీ నిర్వాహకులు బ్లాక్ మెయిలింగ్ చేశారని సాయి అరవింద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా షేమింగ్, ఫొటోలను మార్ఫింగ్, ఎక్కువ సార్లు ఫోన్ చేసి అసభ్యకరమైన భాషను ఉపయోగించి అవమానపరిచారని బాధితుడు వాపోయారు.
తన తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులకు కూడా ఫోన్ చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సదురు మై బ్యాంక్ యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: మనసులు గెలిచిన ప్రేమ.. మరణం ముందు ఓడింది.!