లాక్డౌన్.. కరోనా.. వరదలు.. అనారోగ్యం ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వివిధ వర్గాల ప్రజలకు సువర్ణ ఫౌండేషన్ అండగా నిలబడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కట్టలేని పేద విద్యార్థుల కోసమే "బంగారు బాల" పేరుతో నిధులు సమకూర్చామని హైదరాబాద్ నాంపల్లిలో ఫౌండేషన్ ఛైర్మన్ రాజేశ్ బెస్త తెలిపారు. ఈ క్రమంలో సుమారు వంద మంది అభాగ్యులకు రూ. 16 లక్షల చెక్కులను అందించామని రాజేశ్ స్పష్టం చేశారు.
ఉపశమనం కలిగించాలనే..
కరోనా నేపథ్యంలో ఉపాధి లేక మధ్యతరగతి, పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ నుంచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
ఆ పాపకు రూ.లక్ష
ఊపిరితిత్తుల వ్యాధితో గత నెల రోజులుగా బాధపడుతున్న మచ్చ బొల్లారానికి చెందిన నెల వయసున్న పాపకు రూ.లక్ష రూపాయల చెక్కును అందజేసినట్లు పేర్కొన్నారు. హిమాయత్ నగర్లో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న దత్తానగర్ ప్రజలకు నిత్యావసర సరుకులను సైతం పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: వరద నుంచి త్రుటిలో తప్పించుకున్న 8 మంది