Mokila Layout E-Auction Hyderabad : హైదరాబాద్ నగర భూముల వేలంలో ఊహకందని రీతిలో ధరలు పలుకుతున్నాయి. ఇటీవల కోకాపేట భూముల వేలం సంచలనం సృష్టించగా.. తాజాగా ఐటీ ప్రాంతం.. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మోకిల లే అవుట్‌లోని (E Auction for Mokila Layout) ప్లాట్ల ఈ-వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేలంలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. చదరపు గజం గరిష్ఠంగా రూ.1.05 లక్షల వరకు ధర పలికింది. కనీస ధర రూ.72 వేలకు అమ్మడం విశేషం. మొత్తం ప్లాట్లకు సరాసరి చదరపు గజం ధర రూ.80 వేలె 397 పలికింది.
Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?
HMDA Layouts E-Auction 2023 : నార్సింగి-శంకర్‌పల్లి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలోని మోకిలలో 165 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లే అవుట్ ఉంది. తొలి విడతలో 15 వేల 800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను విక్రయించేందుకు నెల రోజుల క్రితం హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ (HMDA Notification for Land Auction) జారీ చేసింది. ఒక్కో ప్లాట్ దాదాపు 300- 500 చదరపు గజాల్లోపు ఉంది.
కోకాపేట నియోపొలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగిలకు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అప్‌సెట్ ధర చదరపు గజానికి రూ.25 వేలు నిర్ణయించగా.. కొన్ని మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ధరకు విక్రయం జరిగాయి. మొత్తం 50 ప్లాట్లకు రూ.40 కోట్లు ఆశించగా.. అంతకు మూడు రెట్లు అధికంగా రూ.121.40 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రెండో విడతలో మరో 50 నుంచి 100 ప్లాట్ల వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి చెప్పారు.
కోట్లపేటను తలపించిన కోకాపేట భూముల వేలం.. ఎందాకా ఈ జోరు?
Kokapet Layout Auction 2023 : మరోవైపు తాజాగా నియో పొలిస్ భూముల వేలం ద్వారా హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కోకాపేట భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి మొత్తంగా 3 వేల 319.60 కోట్లు ఆదాయం సమాకూరింది. నియోపొలిస్ భూములకు (Kokapet Layout E-Auction) స్థిరాస్తి సంస్థలు చాలా పోటీ పడ్డాయి. నియో పొలిస్లో నిర్ధేశిత కనీస ధర ఎకరం రూ.35 కోట్లుగా నిర్ణయించగా.. అత్యధికంగా ఎకరాకు దాదాపు రూ.100 కోట్లకు పైగా పలకడంతో గత రికార్డులను తిరగరాసింది.
కోకాపేటలో నియోపొలిస్ పేరుతో హెచ్‌ఎండీఏ 500 ఎకరాల్లో లే అవుట్ సిద్ధం చేయగా.. ఇందులో రూ.450 కోట్లతో రహదారులతో పాటు మురుగు నీటి వ్యవస్థ, తాగునీరు, భారీ కేబుళ్ల కోసం ప్రత్యేక మార్గం ఇతర అన్ని రకాల సదుపాయాలను కల్పించారు. ఇప్పటికే తొలి విడత వేలంలో కొంత భూమిని అమ్మగా రికార్డు స్థాయిలో ధర పలికింది. అత్యధికంగా ఎకరా రూ.60 కోట్లకు విక్రయం జరిగింది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరింది.
HMDA Notification For Land Auction 2023 : కోకాపేటలో ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల