Moinabad Woman Suicide Case Updates : హైదరాబాద్ మల్లేపల్లి చెందిన తహసీన్‌బేగం ఆత్మహత్య చేసుకుందని నిర్ధారణకు వచ్చేందుకు సీసీ కెమెరాలు దోహదం చేశాయిని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య తర్వాత మృతురాలు ఎవరో అంతుచికక్కపోవడం, సమీప ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వకపోయినా మూడు రోజులు శ్రమించి అసలు వాస్తవాలను నిగ్గుతేల్చామని చెప్పారు. బలవన్మరణానికి పాల్పడ్డ యువతి బాకారం సమీపంలోని రిసార్ట్‌కు గతంలో వచ్చినట్లు వెల్లడించారు. ఆటో డ్రైవరు ఎక్కడికి వెళ్లాలని అడిగినప్పుడు తన ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌లో లోకేషన్ చూపించి అక్కడికి తీసుకెళ్లాలని సూచించినట్లు దర్యాప్తులో తేలింది. నిర్మానుష్య ప్రాంతం కావడం వల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Moinabad Woman Suicide CCTV Footage : మొయినాబాద్ బాకారం వద్ద ఈనెల 8వ తేదీన యువతి దహనం ఘటన వెలుగులోకి వచ్చాక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తొలుత దీన్ని హత్య కేసుగానే భావించి దర్యాప్తు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 200 యువతుల మిస్సింగ్ కేసుల వివరాలు సేకరించి ఘటనాస్థలిలో మృతురాలి వయసు, పోలికలు, లభ్యమైన కొన్ని వస్తువులు, ఇతర ఆధారాల సాయంతో కేసుల్ని పరిశీలించారు.
దీని ఆధారంగా సుమారు 20-25 ఏళ్ల మధ్య వయసున్న యువతుల అదృశ్యానికి సంబంధించి 60 కేసులు కొంత అనుమానాస్పదంగా అనిపించాయి. ఈ కేసుల్లో యువతుల ఫోటోలు, ఇతర ఆధారాలను తెప్పించుకున్నారు. ప్రత్యేక బృందాన్ని ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపించి ఆరా తీశారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి వెంట ఉండే ఠాణాలు, మృతురాలి స్వస్థలం హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లోనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటికి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంతో కేసు దర్యాప్తు సంక్లిష్టంగా మారింది.
జ్యోతిషం నమ్మొద్దన్నందుకు ఒకరు, చట్నీ ఎక్కువగా వేశావన్నందుకు మరొకరి ఆత్మహత్య
Moinabad Woman Suicide Case : రాష్ట్రవ్యాప్తంగా యువతుల అదృశ్యం కేసులు ఆరా తీసిన సమయంలోనే బాకారం, ఎన్కేపల్లి తదితర ఆరు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలపై పోలీసులు దృష్టి సారించారు. ఫుటేజీల్లో రికార్డైన వాహన కదలికల్ని ఆరా తీశారు. ఈ క్రమంలోనే బాకారం దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో 8వ తేదీన మధ్యాహ్నం సమయంలో కొత్తగా ఒక ఆటో వెళ్లడాన్ని గుర్తించారు. వాహన నంబరు గురించి ఆరా తీసి యజమానిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
యువతి 8వ తేదీ అదృశ్యమైనా ఆమె కుటుంబ సభ్యులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండ్రోజుల తర్వాత 10వ తేదీ హబీబ్‌నగర్‌లో ఫిర్యాదు ఇచ్చినా, అదే రోజు ఎఫ్‌ఐఆర్ నమోదవ్వలేదు. కేవలం సీసీ పుటేజీలు, సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్‌పై ఆధారపడి దర్యాప్తు చేయడం వల్లే కేసు దర్యాప్తు కొంత ఆలస్యం అయినట్లు తెలుస్తుంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజీ వల్ల ఈ కేసు ఓ కొలిక్కి వచ్చిందని లేకపోతే మరింత ఆలస్యమై ఉండేదని పోలీసులు అంటున్నారు.
శ్రీమంతం విషయంలో వివాదం - భార్యకు వీడియో కాల్ చేసి భర్త ఆత్మహత్య