ETV Bharat / state

ప్రయాణ ప్రాంగణమా... స్వర్గధామమా...? - FOODCOURT

అత్యంత సుందరమైన భవనం. అత్యాధునిక సౌకర్యాలు. ఉన్నత ప్రమాణాల సేవలు. నేరుగా మెట్రోతో అనుసంధానం. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రూపుదుద్దికున్న నిర్మాణం. ఇదేదో అంతర్జాతీయ విమానాశ్రయం కాదు. ఉత్తరప్రదేశ్​ లక్నోలోని అలంబాగ్​ బస్​స్టేషన్ విశిష్టత​లు..!

అత్యాధునికం... సౌకర్యం... ఆహ్లాదం@ బస్​స్టేషన్​
author img

By

Published : Feb 6, 2019, 6:07 AM IST

ఉత్తరప్రదేశ్​ లక్నోలోని అలంబాగ్​ బస్​స్టేషన్
​ ప్రయాణీకుల రద్దీ... అనౌన్సుమెంట్లు... బస్సు హారన్ల మోతలు ఇవే సర్వసాధారణంగా ప్రయాణప్రాంగణాల్లో కన్పించే దృశ్యం. వీటిని మారుస్తూ... బస్​స్టేషన్ల ఆధునీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆత్యాధునిక హంగులతో రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రయాణ ప్రాంగణాల్లో షాపింగ్​ మాల్స్​, మినీ సినిమా థియేటర్లను నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది. దీని కోసం వివిధ రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని బస్​స్టేషన్ల నమూనాలను రోడ్డు రవాణా అధికారులు పరిశీలిస్తున్నారు.
undefined
ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన లక్నోలోని అలంబాగ్​ బస్​స్టేషన్​ను.. ఇద్దరు సాంకేతిక నిపుణులతో కలిసి ఈడీ పురుషోత్తం నాయక్​, రాజేంద్ర ప్రసాద్​, సీతారాం బాబు సందర్శించారు. 1 నుంచి 3 వరకు పర్యటించిన అధికారులు... పీపీపీ నమూనాలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణ విశేషాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. యూపీ అవలంభిస్తున్న రవాణా విధానాలను తెలంగాణలో అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను సమీక్షించారు.
అత్యంత సుందరం ఈ ప్రాంగణం... !
దేశంలో ఎక్కడా లేనంతా ఉన్నత ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతోపాటు నేరుగా మెట్రోతో అనుసంధానమైన ప్రయాణ ప్రాంగణం లక్నోలోని అలంబాగ్​లో రూపుదిద్దుకుంది​. 2018 జూన్​ 12 న యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్​ దీన్ని ప్రారంభించారు. దీని అందాలకి ఆశ్చర్యపోయిన ఆయన.. ఇది దేశంలోనే అంత్యంత సుందరమైన బస్​స్టేషన్​గా పేర్కొన్నారు.
ప్రయాణ ప్రాంగణ హంగులు ఇలా...!
​​ మూడు అంతస్తుల భవనంగా నిర్మితమైన ఈ ప్రయాణ ప్రాంగణం... 253 కోట్ల రూపాయలతో ముస్తాబైంది. దేశంలో మొదటిసారిగా పీపీపీ నమూనాలో నిర్మితమైన ఈ కట్టడాన్ని చూసి.... మరో 21 ప్రదేశాల్లో కట్టాలని సన్నాహాలు చేస్తున్నారు.
కార్పొరేట్​ బిల్డింగ్​ తరహాలో ఉన్న ఈ బస్​స్టేషన్​లోకి ప్రవేశించగానే మొదట ప్రయాణికులని, వారి సామగ్రిని తనిఖీ చేస్తారు. ఆన్లైన్​ టికెట్​ బుకింగ్​తో పాటు... కౌంటర్​ బుకింగ్​ సౌకర్యం కూడా కల్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి అంతస్తులో విశ్రాంత కుర్చీలతోపాటు ఏసీని ఏర్పాటు చేశారు. రకరకాల వంటకాలతో కూడిన ఫుడ్​కోర్టు కూడా మొదటి అంతస్తులోనే ఉంది. ప్రజలకు ఇటీవల తప్పనిసరి అవసరంగా మారిన వై-ఫైని కూడా ఉచితంగా అందిస్తున్నారు.
మన్నికైన బస్సు సేవలు ఇలా...!
భవనంలోని కింది భాగంలో 49 బస్సు వేదిక(ఫ్లాట్​ఫాం)లను నిర్మించారు. బస్సుల ప్రయాణ వేళలు ప్రదర్శించేందుకు గానూ డిజిటల్​ మానిటర్లు ఏర్పాటు చేశారు. అలంబాగ్​ ప్రయాణ ప్రాంగణం నుంచి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకూ బస్సు సేవలను అందిస్తున్నారు. ఇక్కడి నుంచి నేపాల్​కి​ కూడా బస్సు సేవలున్నాయి.
సాధారణ బస్సులతో పాటు సూపర్​ లగ్జరీ, హై-ఫై, వోల్వోలాంటి సేవలను కూడా ప్రయాణికులు సరసమైన ధరలకే వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. బస్​స్టేషన్​ నుంచి నేరుగా మెట్రో స్టేషన్​కి అనుసంధానం చేయటం మరో అరుదైన విశిష్టత.
ప్రయాణికుల భద్రత ఇలా...!
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణ ప్రాంగణంలో 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు బెస్మెంట్​లో 22 సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ప్రతి దృశ్యాన్ని ట్రాక్​ చేసేలా కట్టుదిట్టం చేశారు. మూడు అంతస్తుల్లో సెక్యూరిటీ గార్డులు ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
ఉద్యోగులు సౌకర్యార్థం...
డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సేద తీరడానికి మూడో అంతస్తులో అందమైన విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. రోడ్డు రవాణా అధికారుల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని సిద్ధం చేశారు. సిబ్బంది కోసం హోటళ్లను కూడా ఏర్పాటు చేశారు.
ఆహ్లాద వాతావరణం కోసం....!
ఉన్నతమైన ప్రమాణాలతో నిర్మితమైన ఈ ప్రాంగణంలో ప్రయాణికులకు షాపింగ్​ మాల్స్​ సౌలభ్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం ఓ వాణిజ్య​ సముదాయాన్ని సిద్ధం చేశారు. అలాగే బ్యాంకింగ్​, పోస్టాఫీస్​ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ఆహ్లాదాన్ని రెట్టింపు చేసేందుకు బస్​స్టేషన్లో ఇప్పటికే సిద్ధమైన మల్టీప్లెక్స్​ని త్వరలో ప్రారంభించనున్నారు.​ అక్కడే గడపాలనుకునే ప్రయాణికుల కోసం అందమైన, చవకైన గదులను నిర్మించారు.
దీన్ని చూశాక... విమానాల్లో ప్రయాణించే వాళ్లు సైతం... ఒక్కసారైన ఈ ప్రయాణ ప్రాంగణం సందర్శించేందుకు లక్నో బస్సెక్కాలని ఉవ్విళ్లూరుతారు. ఇక అలాంటి బస్​స్టేషన్లు మన రాష్ట్రంలో వస్తే ఇంకేముంది....! ఇప్పటికే ప్రయాణ ప్రాంగణాల్లో షాపింగ్​మాళ్లు, మినీ సినిమా హాళ్లు నిర్మించాలనుకునే ప్రభుత్వ ఆలోచన మరింత అందంగా ముస్తాబైనట్లే మరి....!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.