గిరిజనుల రిజర్వేషన్ల అంశంలో నిరహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌కు జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష చేస్తున్న రాములుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
గిరిజనుల హక్కులను కాలరాసే జీవో నెంబర్ మూడును వెంటనే పునరుద్దరించాలని అన్నారు. సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : 'అధిక విద్యుత్ చార్జీలు తెరాస వైఫల్యమే'