గాంధీలో కొవిడ్ రోగి మృతి చెందిన విషయం తెలుసుకుని మృతుడి బంధువులు జూనియర్ వైద్యులపై దాడికి దిగారు. దీనితో గాంధీలో జూడాలు నిన్న రాత్రి నుంచి విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. గాంధీ ఎదుట రోడ్‌పై బైఠాయించి జూడాలకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.
కొవిడ్ రోగులకు గాంధీ సహా ఇతర ఆస్పత్రుల్లోనూ చికిత్స అందించేందుకు అనుమతి ఇవ్వడం సహా... వైద్యులపై దాడులను కఠినంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి దీనిపై మంత్రి ఈటెల జూడాలతో చర్చిస్తున్నారు. ఇక గాంధీలో నిరసన చేస్తున్న జూడాలు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావుకి పోలీసులు సర్దిచెప్పి వెనక్కి పంపారు. ఇక వీహెచ్ సహా పలువురు నేతలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సైతం గాంధీ జూడాలకు మద్దతు ప్రకటించాయి.
'డాక్టర్లకు రక్షణ కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్లపై ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం- ఎమ్మెల్సీ రామచంద్ర రావు'
ఇవీ చదవండి: ఎస్ఈసీ వ్యవహారం: మెుదటి నుంచి.. అసలేం జరిగింది..?